జనానికి రీచ్ అయింది! : నిర్మాత ‘దిల్’ రాజు
‘‘మా ‘కృష్ణాష్టమి’ మాస్ ఎంటర్‌టైనర్‌గా విజయం అందుకుంది. సునీల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మాస్ ఎలిమెంట్స్ జనానికి రీచ్ అయ్యాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సునీల్, నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడేలతో వాసువర్మ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వ హించారు. హీరో సునీల్ మాట్లాడుతూ- ‘‘ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తు న్నారు.
‘దిల్’ రాజుగారు లేకుంటే ఈ చిత్రం ఉండేది కాదు. ఈ విజయంతో మరిన్ని ప్రయోగాలు చేయవచ్చనే ధీమా వచ్చింది’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల ముఖాల్లో సంతోషం కోసం పడ్డ కష్టం వృథా కాలేదు. వసూళ్లు స్టడీగా ఉన్నాయి’’ అని వాసువర్మ పేర్కొన్నారు. నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే, సంగీత దర్శకుడు దినేష్ కూడా మాట్లాడారు.