న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించి రూ.5 కోట్లకుపైగా ఎగవేత, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం అంశాలను తీవ్ర నేరంగా పరిగణించడం జరుగుతుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే ప్రాసిక్యూషన్ చర్యలు ఉంటాయని ఉద్ఘాటించింది.
కాగా, ఎప్పుడూ ఎగవేతలకు పాల్పడే వారు లేదా ఆయా కేసులకు సంబంధించి అప్పటికే అరెస్ట్ అయిన సందర్భాల్లో ప్రాసిక్యూషన్‌కు తాజా నోటిఫికేషన్‌తో సంబంధం లేదని ఫైనాన్స్ శాఖ జీఎస్‌టీ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment