
రూ. 2 కోట్లలోపు పన్ను ఎగవేతకు బెయిల్
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు భారంగా మారకుండా శిక్షార్హమైన నిబంధనల తీవ్రత తగ్గించాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయించాయి. పన్ను ఎగవేత రూ. 2 కోట్ల లోపు ఉంటే ఆ వ్యాపారి బెయిల్ పొందే అవకాశం కల్పించనున్నారు. కేవలం ఫోర్జరీ, నిర్దేశిత సమయంలో సేకరించిన పన్నుల్ని ప్రభుత్వానికి చెల్లించనప్పుడు మాత్రమే అరెస్టు చేసేలా నిబంధనల్ని రూపొందించాలని గత జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర రెవెన్యూ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.
‘జీఎస్టీ పరిధిలో తప్పు జరిగినప్పుడు ఆ మొత్తం రూ. 2 కోట్ల కంటే మించకుండా ఉంటే... అరెస్టయ్యే వ్యక్తి బెయిల్‌కి అర్హుడవుతాడు’ అని ఆయన తెలిపారు.