పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్‌కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్‌టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది.
ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment