మరిన్ని ఐటీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు!.. ఎందుకంటే? | More IT Companies Likely To Get Tax Evasion Notices | Sakshi
Sakshi News home page

మరిన్ని ఐటీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు!.. ఎందుకంటే?

Published Fri, Aug 2 2024 9:18 AM | Last Updated on Fri, Aug 2 2024 9:26 AM

More IT Companies Likely To Get Tax Evasion Notices

పన్నులు చెల్లించలేదనే కారణంగా ఇన్ఫోసిస్ కంపెనీకి జీఎస్‌టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32,403 కోట్ల రూపాయలకు జీఎస్‌టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.

ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు.. మరిన్ని టెక్ కంపెనీలను రాబోయే రోజుల్లో ఇలాంటి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. తమ విదేశీ కార్యాలయాల సేవలపై పన్నును ఎగవేసిన ఆరోపణలపై తదుపరి పరిశీలనలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ప్రీ-షోకాజ్ నోటీసు అందుకున్న తరువాత ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు జీఎస్‌టీ చెల్లిస్తూనే ఉన్నామని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.

ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్‌టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్‌టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement