పన్ను పారదర్శక కూటమిలోకి పనామా | Panama joins international efforts against tax evasion and avoidance | Sakshi
Sakshi News home page

పన్ను పారదర్శక కూటమిలోకి పనామా

Published Fri, Oct 28 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

Panama joins international efforts against tax evasion and avoidance

పారిస్‌: సీమాంతర పన్ను ఎగవేతదారులపై పోరాటానికి ఏర్పడ్డ ప్రపంచ కూటమిలో పనామా దేశం కూడా చేరింది. దీంతో ఈ కూటమిలో దేశాల సంఖ్య 105కు పెరిగింది. ‘పన్ను విషయాల్లో పరిపాలనా పరమైన సహాయంపై బహుపాక్షిక కూటమి’లో సభ్య దేశంగా గురువారం పనామా చేరింది. కూటమిలో సభ్యదేశాలు పన్నులు చెల్లించేవారి సమాచారాన్ని పంచుకుంటాయి.

ఈ ఏడాది ప్రారంభంలో పనామా పేపర్స్‌ లీక్స్‌ పేరుతో అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం పలు కంపెనీల బండారం బయట పెట్టడంతో ఒక్కసారిగా పనామా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భారత్‌ 2012లో చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement