
ముత్తూట్ సంస్థలపై ఆకస్మిక తనిఖీలు
కొచ్చి: పన్ను ఎగవేత అరోపణల నేపథ్యంలో ముత్తూట్ సంస్థ బ్రాంచ్ లపై ఆదాయపన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు కీలక నగరాలతో పాటు కేరళలోని కొన్ని ముఖ్య పట్టణాలలో ముత్తూట్ ఆస్తులపై అధికారులు ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి.
తిరువనంతపురం, కొచ్చి, కొలెన్చెర్రీలతో పాటు న్యూఢిల్లీ, ముంబై, కొయంబత్తూర్, చెన్నై, బెంగళూరు నగరాలలో సోదాలు నిర్వహించిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేటి (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఇప్పటికీ కొన్ని నగరాలలో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. తనిఖీలలో భాగంగా ఆదాయపన్ను శాఖ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు ముత్తూట్ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.