దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది బీద, మధ్య తరగతి ప్రజలతో పాటు పన్ను చెల్లింపుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త ఇళ్లు కొనుగోలుచేయడానికి ఖర్చు చేసే పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సాదారణంగా అయితే ఈ గడువు తేదీ జూన్ 30వ తేదీతో ముగియాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని గడువును పెంచింది.
దీనికి సంబందించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 జీబీ ప్రకారం మీరు మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ప్రాపర్టీ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును మూడు సంవత్సరాల లోపు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి లేదా రెండు సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనడానికి వాడాలి. అప్పుడే మీరు పెట్టుబడి పెట్టే నగదుపై పన్ను మినహాయింపు లభిస్తుంది. 2019 కేంద్ర బడ్జెట్ లో సెక్షన్ 54 కింద మూలధన లాభం పన్ను మినహాయింపును పెంచింది. పెట్టుబడి పెట్టె నగదు రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అలాగే, పన్ను చెల్లింపుదారుడు ఈ అవకాశాన్ని ఒకసారి మాత్రమే వినియోగించుకోవచ్చు.
Income Tax Exemption: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్!
Published Sun, Jun 27 2021 5:11 PM | Last Updated on Sun, Jun 27 2021 6:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment