న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది.
కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది.
ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment