వస్తు, సర్వీసుల విక్రయాల్లో రూ. 2 లక్షల నగదు లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆదాయ పన్ను (ఐటీ) విభాగం శుక్రవారం వివరణ ఇచ్చింది. ఒకే లావాదేవీలో నగదు పరిమాణం రూ. 2 లక్షలు మించితే, విక్రయాల ద్వారా నగదు పొందినవారు తమ దృష్టికి తేవాల్సి ఉంటుందని పేర్కొంది.