‘గార్‌’ వాయిదా లేదు | CBDT issues fresh notice on GAAR implementation | Sakshi

‘గార్‌’ వాయిదా లేదు

Published Sat, Jan 28 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

‘గార్‌’ వాయిదా లేదు

‘గార్‌’ వాయిదా లేదు

గార్‌ (జనరల్‌ యాంటీ అవైడెన్స్‌ రూల్స్‌) అమలు మరో ఏడాదిపాటు వాయిదా పడవచ్చన్న అంచనాలకు సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌) తెరదింపింది.

ఏప్రిల్‌ 1 నుంచీ అమలు
సీబీడీటీ తాజా నోటీసు జారీ  

న్యూఢిల్లీ: గార్‌ (జనరల్‌ యాంటీ అవైడెన్స్‌ రూల్స్‌) అమలు మరో ఏడాదిపాటు వాయిదా పడవచ్చన్న అంచనాలకు సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌) తెరదింపింది. ఏప్రిల్‌1వ తేదీ నుంచే గార్‌ అమలవుతుందని స్పష్టం చేసింది. పన్నులను తప్పించుకోడానికి ఇతర దేశాల ద్వారా ‘రూటింగ్‌ లావాదేవీలు’ జరపకుండా కంపెనీలను నిరోధించడానికి గార్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇతర దేశాలతో భారత్‌ పన్ను ఒప్పందాలు దుర్వినియోగం కాకుండా గార్‌ దోహదపడుతుంది.  దీనిపై కొందరు ఇన్వెస్టర్ల ఆందోళనలపై సీబీడీటీ తాజా వివరణ ఇచ్చింది. దీనిప్రకారం

ఒక విదేశీ ఇన్వెస్టర్‌(ఎఫ్‌పీఐ) జ్యూరిస్‌డెక్షన్‌ పన్ను యేతర వాణిజ్య అంశాల ప్రాతిపదికన ఖరారయి నా.. వ్యాపార లావాదేవీలకు పన్ను ప్రయోజనాలతో సంబంధం లేకపోయినా.. గార్‌ వర్తించదు.
ఒక లావాదేవీ అమలుకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని పన్నుచెల్లింపుదారు ఎంచుకున్న సందర్భంలో..  ఇందుకు పరస్పర విరుద్ధమైన రీతిలో గార్‌ నిబంధనలు అమలుకావు.
ఏప్రిల్‌1వ తేదీకి ముందు కన్వర్టబుల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, బోనస్‌ల జారీ ద్వారా జరిగిన ఇన్వెస్ట్‌మెంట్లకు గార్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.
ప్రస్తుత పన్ను ఒప్పందాలు పన్ను ఎగవేతలను నిరోధించడానికి పూర్తి స్థాయిలో వినియోగపడకపోతే, ఈ సమస్యను ఎదుర్కొనడానికి తగిన నిబంధనల రూపకల్పన ఎప్పటికప్పుడు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement