GAAR
-
‘గార్’ వాయిదా లేదు
• ఏప్రిల్ 1 నుంచీ అమలు • సీబీడీటీ తాజా నోటీసు జారీ న్యూఢిల్లీ: గార్ (జనరల్ యాంటీ అవైడెన్స్ రూల్స్) అమలు మరో ఏడాదిపాటు వాయిదా పడవచ్చన్న అంచనాలకు సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) తెరదింపింది. ఏప్రిల్1వ తేదీ నుంచే గార్ అమలవుతుందని స్పష్టం చేసింది. పన్నులను తప్పించుకోడానికి ఇతర దేశాల ద్వారా ‘రూటింగ్ లావాదేవీలు’ జరపకుండా కంపెనీలను నిరోధించడానికి గార్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఇతర దేశాలతో భారత్ పన్ను ఒప్పందాలు దుర్వినియోగం కాకుండా గార్ దోహదపడుతుంది. దీనిపై కొందరు ఇన్వెస్టర్ల ఆందోళనలపై సీబీడీటీ తాజా వివరణ ఇచ్చింది. దీనిప్రకారం ⇔ ఒక విదేశీ ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) జ్యూరిస్డెక్షన్ పన్ను యేతర వాణిజ్య అంశాల ప్రాతిపదికన ఖరారయి నా.. వ్యాపార లావాదేవీలకు పన్ను ప్రయోజనాలతో సంబంధం లేకపోయినా.. గార్ వర్తించదు. ⇔ ఒక లావాదేవీ అమలుకు సంబంధించి ఒక స్పష్టమైన విధానాన్ని పన్నుచెల్లింపుదారు ఎంచుకున్న సందర్భంలో.. ఇందుకు పరస్పర విరుద్ధమైన రీతిలో గార్ నిబంధనలు అమలుకావు. ⇔ ఏప్రిల్1వ తేదీకి ముందు కన్వర్టబుల్ ఇన్వెస్ట్మెంట్స్, బోనస్‌ల జారీ ద్వారా జరిగిన ఇన్వెస్ట్మెంట్లకు గార్ నుంచి మినహాయింపు ఉంటుంది. ⇔ ప్రస్తుత పన్ను ఒప్పందాలు పన్ను ఎగవేతలను నిరోధించడానికి పూర్తి స్థాయిలో వినియోగపడకపోతే, ఈ సమస్యను ఎదుర్కొనడానికి తగిన నిబంధనల రూపకల్పన ఎప్పటికప్పుడు జరుగుతుంది. -
‘గార్’ అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ: వివాదాస్పద పన్ను ఎగవేతల నిరోధ చట్టం(గార్)ను ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన బడ్జెట్ అనంతర చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గార్ అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గార్ అమలును గత ప్రభుత్వం వాయిదా వేసింది. అంటే దీనిపై సమీక్షకు సంబంధించి కొత్త సర్కారుకు ఇంకా 8 నెలలపాటు తగినంత సమయం ఉన్నట్లే’ అని దాస్ పేర్కొన్నారు. ప్రధానంగా పన్నుల రహిత దేశాల్లోని సంస్థల ద్వారా భారత్‌లో పెట్టుబడులపై పన్ను ఎగవేతలను అరికట్టడమే లక్ష్యంగా ఈ గార్ నిబంధలను తీసుకొచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగా, ఈ షెడ్యూల్ ప్రకారమే గార్‌ను అమలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేయడంతో ఇన్వెస్టర్ల ఆందోళనలు మళ్లీ తెరపైకివచ్చాయి. దీంతో ఆర్థిక శాఖ వర్గాలు తాజా వివరణలు ఇస్తున్నాయి. కాగా పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచనల మేరకు మార్పుచేర్పులు జరిగిన ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) ముసాయిదా బిల్లు తమవద్ద ఉందని.. ప్రభుత్వం దీన్ని విశ్లేషించనుందని దాస్ చెప్పారు. తాజా బడ్జెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచేదిశగా అనేక చర్యలు ఉన్నాయని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.