ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ చేసే వారికి ఊరట. కొత్త ఐటీఆర్ పోర్టల్ విషయంలో అనేకా సాంకేతిక సమస్యలు రావడంతో ఆ సమస్యలను ఇన్ఫోసీస్ పరిష్కరించింది. దీంతో ఫైలింగ్ విషయంలో వేగం పుంజుకున్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) గడువు తేదీలను పొడగించే అవకాశం ఉంది. సాంకేతిక కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో గడువు పొడగించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న గడువు ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది.
ఆగస్టు 21 నుండి రెండు రోజుల పాటు పోర్టల్ మొత్తం నిలిచిపోవడంతో గత నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అందుకే పరిస్థితిని బట్టి కేంద్రం కీలక రిటర్న్ ఫైలింగ్ గడువు తేదీలను పొడగించనుంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఇవనున్నట్లు తెలుస్తుంది. "కొత్త పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక అవాంతరాల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యం అవుతున్నాయి. అందుకే, తేదీల పొడిగింపు గురుంచి రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం ఉంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు ఫైలింగ్ చేయడానికి తగినంత సమయం ఇవ్వడం వల్ల వారిలో ఉన్న భయం కొంచెం తగ్గే అవకాశం ఉంది" అని కొందరు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు.(చదవండి: ఆస్తుల నగదీకరణ ఎందుకు ?)
కొత్త వెబ్‌సైట్‌లో ఉన్న మొత్తం సమస్యలను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ సీఈఓకు సూచించారు. ఒకవేల అప్పటి వరకు అన్ని సమస్యలను పరిష్కరించిన మరో 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. కాబట్టి, అంత తక్కువ సమయంలో ఐటీ రిటర్న్స్ సమర్పణ సాధ్యం కాదనే భావనలో అధికారులు ఉన్నారు. అందుకే మరోసారి ఐటీ రిటర్న్స్‌ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment