
ముంబై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) 2021 జూలై 15 వరకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) తో పాటు ఇతర ప్రవాసులకు ఆదాయపు పన్ను చెల్లింపులను దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. ఆదాయపు పన్నులను మ్యానువల్‌గా చెల్లించడానికి టాక్స్ పేయర్లకు ఆప్షన్‌ను సీబీడీటీ ఇచ్చింది.ఆదాయపు పన్ను శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆదాయపు పన్ను ఫారాలు 15 సీఎ, 15 సీబీలను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు ఎన్‌ఆర్‌ఐ టాక్స్ పేయర్లకు ఈ ఫైలింగ్ చేయడానికి జూన్ 30 చివరి తేదిగా ఉంది.పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రెండు ఫారాలను మాన్యువల్ ఫార్మాట్‌లో అధీకృత డీలర్లకు సమర్పించవచ్చని, అంతేకాకుండా విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం ఈ ఫారాలను 2021 జూలై 15 వరకు అంగీకరించాలని ఆర్థిక శాఖ సూచించింది. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్(DIN)ను రూపొందించే ఉద్దేశ్యంతో ఈ ఫారమ్‌లను తరువాతి తేదీలో అప్‌లోడ్ చేయడం కోసం కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌తో అవకాశం కల్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
CBDT grants further relaxation in electronic filing of forms 15CA & 15CB in view of difficulties reported by taxpayers in filing of the forms online on https://t.co/GYvO3n9wMf. Date for submission of forms in manual format to the authorised dealers is extended to 15th July, 2021. pic.twitter.com/gQLRJsnlBu
— Income Tax India (@IncomeTaxIndia) July 5, 2021