సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కోటీశ్వరులు సంఖ్య పెరుగుతోంది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో కరోడ్ పతిల సంఖ్య భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత పన్నులు చెల్లిస్తున్నవారు గత నాలుగేళ్లలో 1.40లక్షల మంది పెరిగారని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కల ప్రకారం కోటి పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య సుమారు 60శాతం పెరుగుదలను నమోదు చేసిందని తెలిపింది.
గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులచెల్లింపుల గణాంకాలను సీబీడీటీ సోమవారం ప్రకటించింది. ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పుంజుకుందని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా గత మూడేళ్లలో పన్ను చెల్లింపు దారుల నమోదు భారీగా పెరిందని తెలిపారు. కోటి రూపాయల ఆదాయాన్ని చూపిస్తూ (కార్పొరేట్లు, సంస్థలు, హిందూ డివైడెడ్ ఫ్యామిలీస్ తదితరులు) ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి మొత్తం సంఖ్య ఏటా 68 శాతం పెరిగిందన్నారు.
కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 55 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014-15 లో రూ. 32.28 లక్షల తో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో సగటు పన్ను రూ .49.95 లక్షలకు పెరిగింది. సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ‍్య 37శాతం పెరిగింది. అలాగే నాన్ సాలరీడ్ టాక్స్ పేయర్స్ సంఖ‍్య 19శాతం వృద్ధిని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment