ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్‌ పొడిగింపు | Income Tax Extends Vivad Se Vishwas Deadline to 2025 January 31 | Sakshi
Sakshi News home page

ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్‌ పొడిగింపు

Published Tue, Dec 31 2024 2:42 PM | Last Updated on Tue, Dec 31 2024 2:59 PM

Income Tax Extends Vivad Se Vishwas Deadline to 2025 January 31

ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.

డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.

పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలు
వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్‌లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.

2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement