ట్యాక్స్ పేయర్స్‌కు ముఖ్య గమనిక. కేంద్ర ఆర్ధిక శాఖ 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి గాను సంస్థల ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సిన గడువును నవంబర్ 7కు పొడిగించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), ఆదాయం,కార్పొరేట్ పన్ను విషయాలలో అపెక్స్ బాడీ గత నెలలో ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి గడువును పొడిగించినందున ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీని కూడా పొడిగించినట్లు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
‘సీబీడీటీ అసెస్‌మెంట్ ఇయర్ 2022-23 చట్టంలోని సెక్షన్ 139 సబ్-సెక్షన్ (1) కింద సంస్థలు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే గడువు తేదీని అక్టోబర్ 31, 2022.. నవంబర్ 7, 2022 వరకు పొడిగించింది’ అని సీబీడీటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment