ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) శనివారం ఏప్రిల్ 1, 2021 - ఆగస్టు 30, 2021 మధ్య 23.99 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్ల విలువైన నగదును తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 3న ఐటీఆర్ దాఖలు చేసిన 22,61,918 మందికి రూ.16,373 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లు, అలాగే, 1,37,327 కేసుల్లో రూ.51,029 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్ చేసినట్లు పేర్కొంది.(చదవండి: ఇక రెండుగా ఈపీఎఫ్ ఖాతాల విభజన)
ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల మధ్య ఐటీఆర్ రీఫండ్ చేసింది. అయితే, ఈ సమస్య కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా తమ ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయలేదు. సాధారణంగా, ఐటీఆర్ రీఫండ్ దాఖలు చేసిన 10 రోజుల్లోగా జారీ చేస్తారు. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా ఆలస్యం కావొచ్చు. అయితే, ఒకవేళ మీరు ఇంకా మీ రీఫండ్ అందుకోనట్లయితే, ఐ-టీ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ మీరు ఐటీఆర్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి:
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్ డీఎల్) వెబ్ సైట్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్ సైట్ లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ డిఎల్ వెబ్ సైట్ లో, మీరు పాన్, అసెస్ మెంట్ ఇయర్(ఎవై) వివరాలు నమోదు చేసి 'ప్రొసీడ్' మీద క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది.(చదవండి: నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా..?)
- మొదట మీరు ఐ-టీ డిపార్ట్ మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో లాగిన్ కావాలి.
- ఇప్పుడు రిటర్న్స్/ఫారమ్స్ ఎంచుకోండి.
- ఆ తర్వాత 'మై అకౌంట్' ట్యాబ్ కు వెళ్లి 'ఐ-టీ రిటర్న్స్' ఎంచుకోండి.
- ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
- అలాగే, అక్నాలెడ్జ్ మెంట్ నెంబరుపై క్లిక్ చేయండి.
- ఆదాయపు పన్ను రీఫండ్ స్టేటస్ తో పాటు మీ రిటర్న్ వివరాలను పేజీ మీద కనిపిస్తాయి.
పన్ను చెల్లింపుదారులు రీఫండ్ డబ్బు నేరుగా వారి ఖాతాకు క్రెడిట్ చేస్తారు. చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చిరునామాకు పంపిస్తారు. అందువల్ల, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన వివరాలు సరిగ్గా నింపబడ్డాయని వారు ధృవీకరించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment