ట్యాక్స్‌ పేయర్స్‌కి షాక్‌! బడ్జెట్‌లో అవకాశం అన్నారు.. వాడుకోబోతే మెలిపెడుతున్నారు | CBDT Chairman JB Mohapatra Says Taxpayers Can File Only One Updated Return In An Assessment Year | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌ పేయర్స్‌కి అలెర్ట్‌! ఐటీ రిటర్నుల రెండేళ్ల గడువులో మరో మెలిక

Published Thu, Feb 10 2022 8:14 AM | Last Updated on Thu, Feb 10 2022 11:12 AM

CBDT Chairman JB Mohapatra Says Taxpayers Can File Only One Updated Return In An Assessment Year - Sakshi

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారు ఒక అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ఒక్క విడతే రిటర్నులను (ఐటీఆర్‌) సవరించేందుకు (అప్‌డేట్‌) అనుమతి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్‌ జేబీ మహాపాత్ర తెలిపారు. పన్ను రిటర్నులకు సంబంధించి వెల్లడించాల్సినది ఏదైనా నిజాయితీగా మర్చిపోయిన వారికి ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఐటీఆర్‌లను దాఖలు చేసిన తర్వాత రెండేళ్ల వరకు వాటిని సవరించుకోవచ్చంటూ 2022–23 బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించడం తెలిసిందే. ఇలా సవరించినప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటే.. 12 నెలల్లోపు సవరించినప్పుడు వాస్తవంగా చెల్లించాల్సిన పన్నుకు 25% అదనం, వడ్డీ కట్టాలి. 12 నెలల తర్వాత సవరణ రిటర్నులు వేస్తే అప్పుడు వాస్తవ పన్నుకు అదనంగా 50 శాతం, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కి గుడ్‌న్యూస్‌! నిర్మలమ్మ వరాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement