
న్యూఢిల్లీ: కార్పొరేట్లు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021–22 అసెస్‌మెంట్ ఇయర్) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును మార్చి 15వ తేదీ వరకూ పొడిగిస్తూ, సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది.
2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆడిట్ నివేదిక, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి గడువును కూడా ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్లకు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు పొడిగింపు ఇది మూడవసారి.
చదవండి:ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టు.. కొత్తగా అమల్లోకి ఏఐఎస్