ఒక్కో పన్ను చెల్లింపుదారునకు సంబంధించి పన్ను డిమాండ్ రూ.లక్షవరకు ఉంటే, వాటిని ఆదాయపుపన్ను శాఖ ఉపసంహరించుకోనుంది. ఇటీవల బడ్జెట్లో ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే.
దీనికి సంబంధించి ఆదాయపుపన్ను శాఖ అత్యున్నత నిర్ణయాల మండలి సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. 2015-16 అసెస్ మెంట్ సంవత్సరం వరకు పన్ను చెల్లింపు దారులకు సంబంధించి మొత్తం పన్ను బకాయి రూ.లక్షవరకు ఉంటే వారికి వెసులుబాటు లభించినట్లయింది. అసెస్ మెంట్ సంవత్సరం 2011-12 నుంచి 2015-16 వరకు రూ.10 వేల చొప్పున ఉంటే వాటిని ఉపసంహరించుకోనున్నట్లు సీబీడీటీ తెలిపింది.
ఈ ప్రకటనతో మొత్తం రూ.3.500 కోట్లు విలువ చేసే పన్ను డిమాండ్ లను కేంద్రం వెనక్కి తీసుకోనుంది. అసలు చెల్లించాల్సిన పన్ను, దానిపై వడ్డీ, పెనాల్టీ, సెస్,సర్ ఛార్జీ అన్నీ కలిపిన తర్వాతే రూ.లక్ష పరిమితి అమలు కానున్నట్లు సీబీడీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment