పన్ను చెల్లింపు దారులకు తాజా కబురు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపు దారులకు మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. పన్ను చెల్లింపుల విషయంలో వసూలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనవసరంగా ఒత్తిడిలు తెస్తున్నారని పలు సార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఆ సమస్యకు స్వస్థి పలికేందుకు ఈమెయిల్ సర్వీసును తీసుకురానుంది. నోటీసులు పంపించడం తిరిగి వాటికి బదులు వచ్చే అవకాశం ఉండేలా ఈమెయిల్ సిస్టంను తీర్చిదిద్దాల్సింగా ఇప్పటికే ఐటీ శాఖకు కేంద్ర పన్నుల వసూళ్ల బోర్డు ఆదేశించింది.
'గత కొంత కాలంగా పన్నులు చెల్లించేందుకు తేలికైన మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నాం. అందుకే పన్ను చెల్లింపుదారులకు ఈమెయిల్ పంపించేలా, దానికి తిరిగి వారు ఈ రెస్పాన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం' అని సీబీడీటీ చైర్ పర్సన్ అనితా కపూర్ ఓ ఇంటర్వూలో అన్నారు.