Issuing notices
-
‘ఎక్కడ ఉన్నారో ఎందుకు చెప్పలేదు’
ముంబై: క్రికెటర్లు తమ డోపింగ్ పరీక్షల పరిధిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తమదైన శైలిలో కొరడా ఝళిపించింది. ఐదుగురు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు నిబంధనల ప్రకారం తమ వివరాలు వెల్లడించడంలో విఫలమయ్యారని నోటీసులు జారీ చేసింది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా, రవీంద్ర జడేజా, లోకేశ్ రాహుల్‌తో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలకు నోటీసులు పంపించినట్లు ‘నాడా’ పేర్కొంది. దీనికి సాఫ్ట్వేర్ సమస్యలే కారణమంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇచ్చిన వివరణతో ‘నాడా’ సంతృప్తి చెందినట్లుగా కనిపించడం లేదు. పూర్తి వివరాలు ఇవ్వకుండా... సుదీర్ఘ కాలంగా ‘నాడా’ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటూ వచ్చిన బీసీసీఐ కూడా కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో డోపింగ్ వ్యవస్థలో భాగమైంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేషనల్ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఎన్‌ఆర్‌టీపీ)లో క్రికెటర్లతో సహా మొత్తం 110 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఏడాదిలో కనీసం ఎప్పుడైనా ‘నాడా’ కోరినప్పుడు ఆటగాళ్లు తమ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ‘ఏ సమయంలో ఎక్కడ ఉన్నారు’ అనేది కీలకమైంది. ఫలానా సమయంలో తాము ఫలానా చోట ఉన్నామంటూ ఆటగాళ్లు స్వయంగా యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్స్ సిస్టమ్స్ (ఏడీఏఎంఎస్) ఫామ్‌లో వివరాలు భర్తీ చేయాలి. నిజానికి ఈ ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను తొలగించాలంటూనే సుదీర్ఘ కాలం బీసీసీఐ పోరాడింది. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయవచ్చు. అయితే పెద్దగా చదువుకోని ఆటగాళ్లు ఎవరైనా కొందరు ఉంటే ఇబ్బంది పడవచ్చు కాబట్టి వారి తరఫున ఆయా క్రీడా సమాఖ్యలు కూడా భర్తీ చేసే వెసులుబాటు ఉంది. ఈ బాధ్యతను సమాఖ్యలు తీసుకున్నాయి కూడా. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్ల వివరాలు మాత్రం ‘నాడా’కు అందలేదు. ఇదేం వివరణ... సమాచారం అప్లోడ్ చేయకపోవడంపై బీసీసీఐ తమ వైపు నుంచి వివరణ పంపించింది. ఏడీఏఎంఎస్కు సంబంధించి పాస్వర్డ్ విషయంలో కొంత సమస్య రావడం వల్లే తాము వివరాలు వెల్లడించలేకపోయామని బోర్డు పేర్కొంది. అయితే ‘నాడా’ డీజీ నవీన్ అగర్వాల్ దీనిపై సంతృప్తి చెందలేదు. ఈవెంట్లు జరిగే సమయంలో సమస్య ఉండకపోవచ్చు కానీ లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా ఎలాంటి ఆటలు లేవు కాబట్టి ఈ సమస్యలో ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధన ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘బీసీసీఐ దీనికి కారణం ఏమిటో చెప్పింది. అయితే దీనిపై మేం చర్చిస్తాం. నిజంగా పొరపాటు జరిగిందా లేదంటే దీనిని తొలి వైఫల్యం కింద లెక్క కట్టాలా అనేది తర్వాత నిర్ణయిస్తాం’ అని ఆయన అన్నారు. మూడుసార్లు ఇదే తరహాలో వివరాలు ఇవ్వడంలో విఫలమైతే దానిని డోపింగ్గా భావించి రెండేళ్ల నిషేధం విధించేందుకు ‘నాడా’కు అధికారం ఉంది. ఆ మాత్రం చేయలేరా? తాజా అంశంపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి స్పందిస్తూ... చిన్న పాస్వర్డ్ సమస్యను పరిష్కరించునేందుకు ఇంత సమయం పడుతుందా అని ప్రశ్నించారు. ‘క్రికెటర్లంతా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పైగా ఇన్స్టాగ్రామ్ చాట్లలో కూడా కనిపిస్తున్నారు. తమ వివరాలు ఇవ్వాలని ఈ ఐదుగురికి బీసీసీఐ చెబితే సరిపోయేది కదా. పైగా అందరికీ సొంత మేనేజర్లు కూడా ఉన్నారు. వారు చేయలేరా? ఈ సారికి క్షమిస్తే సరి. ‘నాడా’ అధికారికంగా హెచ్చరిక జారీ చేస్తే ఎవరు బాధ్యులు’ అని ఆయన ప్రశ్నించారు. -
పన్ను చెల్లింపు దారులకు తాజా కబురు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపు దారులకు మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. పన్ను చెల్లింపుల విషయంలో వసూలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అనవసరంగా ఒత్తిడిలు తెస్తున్నారని పలు సార్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఆ సమస్యకు స్వస్థి పలికేందుకు ఈమెయిల్ సర్వీసును తీసుకురానుంది. నోటీసులు పంపించడం తిరిగి వాటికి బదులు వచ్చే అవకాశం ఉండేలా ఈమెయిల్ సిస్టంను తీర్చిదిద్దాల్సింగా ఇప్పటికే ఐటీ శాఖకు కేంద్ర పన్నుల వసూళ్ల బోర్డు ఆదేశించింది. 'గత కొంత కాలంగా పన్నులు చెల్లించేందుకు తేలికైన మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నాం. అందుకే పన్ను చెల్లింపుదారులకు ఈమెయిల్ పంపించేలా, దానికి తిరిగి వారు ఈ రెస్పాన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం' అని సీబీడీటీ చైర్ పర్సన్ అనితా కపూర్ ఓ ఇంటర్వూలో అన్నారు. -
యథేచ్ఛగా సాగిన అక్రమ నిర్మాణాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో బహుళ అంతస్తుల (అపార్టుమెంట్ల) సంస్కృతి రోజు రోజుకూ విస్తరిస్తోంది. అగ్నిమాపక, నగర ప్రణాళిక, గ్రామ పంచాయతీల అనుమతులు లేకున్నా నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి సాగుతున్నా, వాటిని నియంత్రించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఇందుకు రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు, మామూళ్లు ఇలా కారణాలు ఎన్నో! నిబంధనలను తుంగ లో తొక్కి యథేచ్ఛగా సాగించిన అపార్టుమెంట్ల నిర్మాణంపై ఫిర్యాదులు అందినా బుట్టదాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలపై కన్నెత్తయినా చూడలేదు. ఒకవేళ పరిశీలించినా తీసుకున్న చర్యలేమీ లేవు. తీరా అపార్టుమెంట్ల ని ర్మాణం పూర్తయి, వాటి ని కొనుగోలు చేసినవా రు గృహప్రవేశం చేశాక, చేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అధికారులు చర్యలకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడెందుకో నోటీసులు గంగాస్థాన్ ఫేజ్-2లో ఒక అపార్టుమెంట్‌ను కూల్చివేయడం ద్వారా చర్యలకు దిగిన పంచాయతీ అధికారులు, ఒక్క నిజామాబాద్ డీఎల్పీఓ పరిధిలోని గంగాస్థాన్ ఫేజ్-2, గూపన్పల్లి, మానిక్భండార్ల పరిధిలో 12 అపార్టుమెంట్లను అక్రమంగా నిర్మించారని తేల్చారు. ఏడు అపార్టుమెంట్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న 313 కు టుంబాలకు నోటీసులు జారీ చేశారు. నగరంలోనూ నిబంధనలను విస్మరిం చి అపార్టుమెంట్లు, భవనాల నిర్మాణాలు సాగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకో వడం లేదు. తమ లెక్కల ప్రకారం 98 అపార్టుమెంట్లుంటే, అందులో నాలిగింటికి అనుమతులు లేకపోవడంతో నోటీసులు జారీ చేశామంటున్నారు. అడుగడుగునా నిబ ంధనలను ఉల్లంఘిస్తూ నిర్మిస్తున్న అపార్టుమెంట్లపై అధికారులు ఇంతకాలంగా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఎట్టకేలకు కదిలిన అధికార యం త్రాంగం చర్యలకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. గూపన్పల్లి పరిధిలోని గంగాస్థాన్ ఫేజ్-2లో మంగళవారం అనుమతులు లేకుండా నిర్మించారని ఓ అపార్టుమెంట్‌ను కూల్చివేయడం కలకలం రేపుతోంది. గూపన్ పల్లిలో కాకుండా నగరంతోపాటు పలుచోట్ల రియల్ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను తుం గలో తొక్కి అపార్టుమెంట్లు నిర్మించారు. వినాయకనగర్, మానిక్‌భండార్ తదితర ప్రాంతాలలో నిర్మించిన కొన్ని అపార్టుమెంట్ల సమీపంలో రోడ్లు కనీసం 15 అడుగులు కూడా లేవు. ఆ వీధుల్లో ఎంచక్కా ఐదు అంతస్తుల భవనాలు పుట్టుకొ చ్చాయి. కనీసం సెట్ బ్యాక్ (ఖాళీ స్థలం). ఫైర్ ఫైటింగ్ సిస్టం (అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ) ఏర్పాటు చేయలేదు. అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించారు. కానీ, అధికారులు ఒక్క భవనం జోలికే వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అపార్టుమెంట్ల నిర్మాణంలో కొందరు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్రజాప్రతి నిధులు సూత్రధారులుగా వ్యవహరిస్తుండట మే ఇందుకు కారణమంటున్నారు. ఎక్కడ పడి తే అక్కడ సాగుతున్న అక్రమ కట్టడాల కారణంగా నగర పాలక సంస్థ ఆదాయానికి భారీ గా గండి పడుతోంది. అనేక మంది భవన యజమానులు నేల, మొదటి అంతస్తులకు అనుమతులు తీసుకుంటూ ఆపై రెండు, మూ డు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారం లో రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు చూసీచూడనట్టు వదిలేయాలంటూ అధికారుల కు హుకుం జారీ చేయడం.. ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మరిన్నికట్టడాలకు దారులు తెరుస్తున్నారు. అవినీతికి కేరాఫ్ నగర, పట్టణ శివార్లను ఆనుకుని ఉన్న ప్రాంతాలు అపార్టుమెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన ప్రాంతాలుగా మా రాయి. ఆయా గ్రామ పంచాయతీలలో పనిచేసే కొందరు అవినీతి అధికారులు ‘మామూళ్ల’కు మరిగారు. ఫలితంగా గూపన్పల్లి, మానిక్‌భండార్, గంగాస్థాన తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో ముగ్గురు అవినీతి వీఆర్ఓలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారంటే, ఆ శాఖలోని కిం దిస్థాయి ఉద్యోగులలో అవినీతి ఎంత పెరి గిందో అంచనా వేయవచ్చు. నగరాలు, పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముందుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ప్రణాళిక విభాగానికి దరఖాస్తుతో పాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్ర ణాళిక (మాస్టర్ ప్లాన్) అనుగుణంగా ఉన్న స్థలంలో భవనాన్ని ఎంతమేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పురపాలక సంఘాల్లోనూ పట్టణ ప్రణాళికా విభాగం సూచించిన మేర 50 శాతం కూడ నిర్మాణాలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.