
న్యూఢిల్లీ: ‘ఈ-అడ్వాన్స్ రూలింగ్ స్కీమ్, 2022’ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి(సీబీడీటీ) నోటిఫై చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులు అడ్వాన్స్ రూలింగ్‌కు సంబంధించి తమ దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా ఫైల్ చేసుకునే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా స్థానికేతర పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరంగా ఉండనుంది.
పన్ను కేసుల్లో విచారణను అడ్వాన్స్ రూలింగ్స్ బోర్డ్ వీడియో కాన్ఫరెన్స్/వీడియో టెలిఫోనీ ద్వారా చేపట్టేందుకు ఈ పథకం అనుమతిస్తుంది. నాన్ రెసిడెండ్‌లు, కొన్ని ప్రత్యేక కేటగిరీ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి స్పష్టత ఇచ్చేందుకు ఆదాయపన్ను చట్టం కింద అడ్వాన్స్‌రూలింగ్ యంత్రాంగం పనిచేస్తుంటుంది. భారత్‌లో లావాదేవీలకు భారత పన్ను చట్టాల కింద పన్ను అంశాల్లోనూ స్పష్టత ఇస్తుంది. దీనికింద అడ్వాన్స్ రూలింగ్స్ బోర్డు చేసే సమాచార, సంప్రదింపులను ఈ మెయిల్ రూపంలో పన్ను చెల్లింపుదారులకు పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment