
పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువును పొడిగించింది. సర్క్యులర్ ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం టీడీఎస్ పన్ను దాఖలు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు పేర్కొంది. అంతకుముందు టీడీఎస్ ను దాఖలు చేయడానికి గడువు మే 31 వరకు ఉండేది. ఈ కొత్త సర్క్యులర్ ప్రకారం.. ఫారం 16 జారీ చేయవలసిన తేదీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు పొడగించారు.
తాజా టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఫారమ్ లలో ఉద్యోగుల కోసం మరో కాలమ్ జోడించబడింది. దీని ప్రకారం, టీడీఎస్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో కొత్తగా పన్ను చెల్లించే వారు ఈ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుందని టాక్స్ 2 విన్ సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ సోని అన్నారు. అలాగే గత రెండేళ్లలో వ్యక్తి టీడీఎస్ దాఖలు చేయకపోతే, రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ప్రభుత్వం ఎక్కువ పన్ను వసూలు చేస్తుంది అని అన్నారు. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు నగదు రూపంలో చెల్లించాల్సిన పన్ను మొత్తం లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉంటే, సెక్షన్ 234ఎ కింద జరిమానా, వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత తేదీ నుంచి వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment