న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) చైర్మన్ సుశీల్ చంద్ర పదవీకాలాన్ని మరో సం.రంపాటు పొడిగించారు. త్వరలో ముగియనున్న సీనియర్ బ్యూరోక్రాట్ సుశీల్ చంద్ర పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. మే 31, 2018 వరకు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఛైర్మన్, ఆరుగురు సభ్యులతో కూడిన సీబీడీటీ చంద్ర నేతృత‍్వంలో నల్లధనాన్ని ఎదుర్కోవడంలో విజయవంతమవుతున్న నేపథ‍్యంలో ఆయన పదవిని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఐఐటీ గ్రాడ్యుయేట్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1980 వ బ్యాచ్‍కు చెందిన సీనియర్ అధికారి సుశీల్ చంద్ర గత ఏడాది నవంబరు 1న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ గా నియమితులయ్యారు. 2015 డిశెంబర్ నుంచి సీబీడీటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఛైర్మన్‌గా ఈయన పదవీకాలం జూన్ తో ముగియనుంది. మరోవైపు సీబీడీటీ చీఫ్ పదవి రేసులో ఉన్న నిషి సింగ్, గోపాల్ ముఖర్జీ చంద్ర కంటే ముందే రిటైర్ కానున్నారు.
సీబీడీటీ ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు
Published Mon, May 8 2017 7:59 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
Advertisement
Advertisement