13 లక్షల ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్రమ డిపాజిట్లను వెలికి తీసే చర్యల్ని వేగవంతం చేసింది. బ్యాంకుల్లో రద్దయిన నోట్ల భారీ డిపాజిట్లను గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో భాగంగా మరింత చురుగ్గా కదులుతోంది. 18 లక్షల ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్ము రూ.4.7లక్షల కోట్లుగా తేల్చింది. ఈ లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగింది.ఆదాయ లెక్కలతో సరిపోలని ఖాతాదారుల డిపాజిట్లపై వివరణ కోరుతూ 13 లక్షల మందికి ఎస్‌ఎమ్మెస్‌లు, ఈ మెయిల్స్ ద్వారా నోటీసులు పంపించినట్టు సీబీడీటీ అధికారి సుశీల్ చంద్ర గురువారం వెల్లడించారు. ఇది ఆపరేషన్ క్లీన్ మనీ లో ఇది మొదటి దశ అని చెప్పారు. ఈ నోటీసులకు 10 రోజుల్లోగా ఆన్ లైన్ లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
కాగా నవంబరు 8 పెద్దనోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ/స్వచ్ ధన్ అభియాన్ అనే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టును ఆరంభించింది. రూ.5 లక్షలకు మించిన లావాదేవీలు అన్నింటినీ అనుమానాస్పద లావాదేవీలుగానే పరిగణించిన ఐటీ శాఖ ఇ- వెరిఫికేషన్ తరువాత సంతృప్తి చెందని ఖాతాలకు నోటీసులు పంపనున్నట్టు ప్రకటించింది. ఆ డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమని సదరు ఖాతాదారులందరికీ ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎ్‌సలు పంపనున్నట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కోటి బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకు మిం చి నగదు జమ అయినట్లు తేల్చిన సంగతి తెలిసిందే.