సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా ఏకే జైన్ | CBDT temporary chairman of the AK Jain | Sakshi
Sakshi News home page

సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా ఏకే జైన్

Published Tue, Dec 1 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా ఏకే జైన్

సీబీడీటీ తాత్కాలిక చైర్మన్‌గా ఏకే జైన్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)  తాత్కాలిక చైర్మన్‌గా సీనియర్ రెవెన్యూ అధికారి ఏకే జైన్ నియమితులయ్యారు. జైన్ 1978 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. ఇప్పటి వరకు సీబీడీటీ చైర్మన్‌గా వ్యవహరించిన అనితా కపూర్ సోమవారం పదవీ విరమణ చేశారు.
 
  ఇకపై అనితా కపూర్ ఆరు నెలలపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలో పన్ను సంస్కరణల సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆమె పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సర్వీసులను అందించడానికి, రానున్న బడ్జెట్ రూపకల్పనకు, ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళతరం చేయడంలోనూ తన వంతు పాత్ర పోషించనున్నారు. అనితా కపూర్ పన్ను సంబంధిత సంస్కరణల విషయంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు తగిన సూచనలను, సలహాలను అందిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఆమె ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల రీ-డ్రాఫ్టింగ్‌కు కోసం రిటైర్డ్ జస్టిస్ ఆర్.వి. ఈశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి సహాయకురాలిగా వ్యవహరిస్తారని పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement