న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ రద్దయిన డొల్ల కంపెనీల నుంచి కోట్ల కొద్దీ రూపాయల పన్ను బకాయిలను రాబట్టుకోవడంపై ఆదాయ పన్ను విభాగం దృష్టి పెట్టింది. ఇందుకోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లలో ఇందుకు సంబం ధించిన పిటిషన్లు దాఖలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాల్ని ఏర్పాటు చేయాలంటూ ఐటీ విభాగాన్ని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది.
ఈ విషయంలో తోడ్పాటు అందించాలంటూ కార్పొరేట్ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. బ్లాక్‌మనీ, మోసపూరిత వ్యాపార కార్యకలాపాలపై కొరడా ఝళిపించే క్రమంలో 2.26 లక్షల పైచిలుకు డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం ఇటీవల రద్దు చేయటంతో న్యాయబద్ధంగా రావాల్సిన కోట్ల కొద్దీ రూపాయల పన్నుల బాకీల వసూళ్లు నిల్చిపోయాయని సీబీడీటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment