న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫామ్స్‌లో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం స్పష్టంచేసింది. ఐటీఆర్ ఫామ్స్‌లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటోన్న కారణంగా రిటర్నులను దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు కేవలం అపోహలు మాత్రమే అని కొట్టిపడేసింది. యుటిలిటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతుందే తప్పించి మరే ఇతర మార్పులు లేవని వివరించింది. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) సమాచారం ఆధారంగా ప్రీ–ఫైలింగ్ వంటి పలు సౌకర్యాలు ఇందులో భాగంగా ఉన్నట్లు తెలిపింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 ఆఖరి తేదీ.
Comments
Please login to add a commentAdd a comment