కమ్ సెప్టెంబర్.. కమ్ సెప్టెంబర్.. అలనాటి పేరు పొందిన పాట. పాట పూర్తయ్యే లోపల రానే వచ్చింది సెప్టెంబర్ 2015. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అసెసీలు వారి రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేది ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అదే 30-09-2015.
గడువు తేది..
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్‌ను పూర్తి చేసిన తర్వాత రిపోర్టును జతపరుస్తూ 2015 సెప్టెంబర్ 30లోగా అసెసీలు ఆన్ లైన్ ద్వారా దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి అసెసీలకు డిజిటల్ సంతకం కావాలి. డిజిటల్ సంతకం కావాలంటే గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలు డిజిటల్ సంతకాన్ని నమోదు చేస్తాయి. ఈ సంతకం లేనిదే రిటర్న్ వేయలేము. ముందుగా సీఏలు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌ని ఆన్‌లైన్‌లో దాఖలు చేస్తారు. ఆ తర్వాత అసెసీ ఈ-ఫైలింగ్ ద్వారా రిటర్న్ ఫైల్ చేస్తారు.
ఎవరికి వర్తిస్తుంది...?
- ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా ఒక వ్యక్తి యొక్క టర్నోవరు, వసూళ్లు, అమ్మకాలు కోటి రూపాయలు దాటితే,
- ఒక ఆర్థిక సంవత్సరంలో వృత్తి ద్వారా ఒక వ్యక్తి యొక్క టర్నోవరు, వసూళ్లు, ఇరవై ఐదు లక్షల రూపాయలు దాటితే,
- కొన్ని వ్యాపారాల్లో ఉన్న అసెసీలకు నిర్దేశించిన లాభ శాతం లేదా ఎక్కువ లాభ శాతం ఆదాయంగా పరిగణిస్తారు. అటువంటి వారు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ అక్కర్లేదు. ఇటువంటి వారు తక్కువ లాభాన్ని చూపిస్తే అకౌంట్స్ రాయాలి. ట్యాక్స్ ఆడిట్ చేయించాలి.
ఫారం 3సీఏ/సీబీ మరియు 3సీడీ..
ట్యాక్స్ ఆడిట్ చేసిన తర్వాత రిపోర్టుని ఫారం 3సీఏ/సీబీ మరియు 3సీడీలోనే ఇవ్వాలి. ఇది కాకుండా లోటుపాట్లు, అవకతవకలు పొందుపరుస్తారు. గతంలో చెప్పాల్సిన వివరాల కన్నా కొత్త ఫారంలో అదనపు వివరాలు ఇవ్వాలి. 3సీడీలో ఎన్నో అంశాలు పొందుపరుస్తారు. ఈ అంశాల సంఖ్య.. పేజీల పరంగా పది పైగా ఉంటాయి. అంశాలను విడిగా లెక్కపెడితే వందలు దాటతాయి. లెక్కలేనన్ని అంశాల మీద లెక్కపూర్వకంగా వివరాలివ్వాలి. తప్పనిసరిగా అవసరమైన ఎన్నో వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ట్యాక్స్ ఆడిట్ అంటే..?
ఆడిట్ అంటే అకౌంట్స్‌ని తనిఖీ చేయడం. ఆదాయ పు పన్ను చట్టప్రకారం చేయించే ఆడిట్‌ని ట్యాక్స్ ఆడిట్ అంటారు. జీతం మీద ఆదాయం, ఇంటి మీ ద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదా యం ఉన్న వారికి.. ఈ ఆడిట్ వర్తించదు. అలాగే, తక్కువ టర్నోవరు, వసూలు ఉన్న వ్యాపారస్తులకి, వృత్తి నిపుణులకి వర్తించదు. ఈ ట్యాక్స్ ఆడిట్‌ని ప్రాక్టీసులో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లతో చేయిం చాలి. అస్సెసీ చేత క్రమంగా... సక్రమంగా లావాదేవీలను నమోదు చేయించడం, బుక్స్ రాయడం, ఎటువంటి అవకతవకలు లేకుండా చూడటం ఈ ఆడి ట్ లక్ష్యం. పెనాల్టీలు వడ్డిస్తారు...
పెనాల్టీలూ ఉంటాయి
సెక్షన్ 271బీ ప్రకారం ఆడిట్ పూర్తి చేసిన గడువు తేదీ లోపల రిటర్న్ దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. టర్నోవరు, వసూళ్లు, అమ్మకాలు మొత్తంలో 0.5 శాతం లేదా రూ. 1,50,000.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే దాన్ని పెనాల్టీగా చెల్లించమంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పన్ను భారం కంటే పెనాల్టీ భారం ఎక్కువ అవుతుంది.
ఆలస్యం ఎందుకు..
మీకు గాని ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తే.. వెంటనే వృత్తి నిపుణులను సంప్రదించి, సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించండి.
ట్యాక్స్ ఆడిట్ చేయిస్తున్నారా?
Published Mon, Sep 21 2015 2:48 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM
Advertisement
Advertisement