
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ అస్వస్థతకు లోనయ్యారు. కొంతకాలంగా ఆయన శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 98 ఏళ్ల వయసున్న ఈ నటుడిని సీనియర్ వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్ పర్యవేక్షిస్తున్నారు.
దిలీప్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన 1944 లో జ్వార్ భాటాతో వెండితెరపై కాలు మోపారు. కోహినూర్, ఆజాద్, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్ వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిసారిగా 1998లో 'ఖిలా' చిత్రంలో కనిపించారు.
చదవండి: Evaru Meelo Koteeswarulu: ఒక్క ప్రోమోతో రూమర్లకు చెక్
Comments
Please login to add a commentAdd a comment