Kamal Haasan Regrets Not Working With Dilip Kumar Says He Begged Him - Sakshi
Sakshi News home page

Kamal Haasan: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ..

Published Sun, May 29 2022 4:30 PM | Last Updated on Sun, May 29 2022 4:42 PM

Kamal Haasan Regrets Not Working With Dilip Kumar Says He Begged Him - Sakshi

Kamal Haasan Regrets Not Working With Dilip Kumar Says He Begged Him: యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌ ముఖ్య పాత్రల్లో అలరించనుండగా సూర్య అతిథి పాత్రలో మెరవనున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. రిలీజ్‌ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ఈ ఇంటర్వ్యూలో ఇతర నటీనటులుతో కలిసి నటించడం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనకు దిలీప్ కుమార్‌ అంటే ఎంతో అభిమానమని, ఆయనతో నటించే అవకాశం కోల్పోవడం గురించి చెప్పుకొచ్చారు. 'నాకు ఇతర నటీనటులతో కలిసి నటించడం అంతే ఎంతో ఇష్టం. నేను నటించాలని కోరుకుని, అలా నటించని నటుడు ఒకరు ఉన్నారు. ఆయనే దిలీప్‌ కుమార్ సర్. నేను 'తేవర్‌ మగన్‌' అనే సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నాను. అందులో నాతో కలిసి నటించమని కోరేందుకు ఆయన్ను కలిశాను. దిలీప్ కుమార్ చేతులు పట్టుకుని మరీ ఆ సినిమాలో నటించాలని ప్రాధేయపడ్డా. కానీ ఆయన ఒప్పుకోలేదు.' అని కమల్‌ హాసన్‌ తెలిపారు. అయితే తర్వాత అదే మూవీని హిందీలో అనిల్‌ కపూర్, అమ్రిష్‌పురి కాంబినేషనల్‌లో 'విరాసత్‌'గా తెరకెక్కించారు. 

చదవండి: 👇
అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం
వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement