మనసారా ప్రేమించా.. ఏరోజూ అనుమానించలేదు: సైరా భాను | Saira Banu Dedicates Emotional Note For Dilip Kumar, Says Never Questioned Anything After Getting Engaged, Post Viral | Sakshi
Sakshi News home page

Saira Bhanu Emotional Note: మనసారా ఆరాధించా.. ఎన్నడూ అనుమానించలేదు:

Published Wed, Oct 2 2024 8:30 PM | Last Updated on Thu, Oct 3 2024 10:46 AM

Saira Banu: Never Questioned Anything After Getting Engaged to Dilip Kumar

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ సైరా భాను.. ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. హీరో దిలీప్‌కుమార్‌ను ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నప్పటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఈరోజు(అక్టోబర్‌ 2న) ఈ దంపతుల 58వ ఎంగేజ్‌మెంట్‌ యానివర్సరీ. ఈ సందర్భంగా సైరా ఎమోషనల్‌ నోట్‌ వదిలింది. 'ప్రేమలో ప్రశ్నలు ఉండకూడదు.. హీరా పేరి సినిమాలో నేను చెప్పిన డైలాగ్‌ ఇది.. 

అందమైన జర్నీ..
నిజ జీవితంలోనూ దాన్నే విశ్వసించాను. ప్రేమలో బలమైన నమ్మకం ఉంటే ప్రశ్నించే అవసరమే రాదు. నా స్వీట్‌హార్ట్‌ దిలీప్‌తో 1966 అక్టోబర్‌ 2న అందమైన ప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి ఎన్నడూ తనను ప్రశ్నించలేదు. మా జర్నీలో ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా తనపై నమ్మకం కోల్పోలేదు.

ఆరాధన..
కేవలం ప్రేమించాను. అక్కడ అనుమానాలకు తావు లేదు. కేవలం ఆరాధన మాత్రమే ఉంది. ఆ భక్తిలోనే నిజమైన ప్రేమ ఉంది' అని రాసుకొచ్చింది. కాగా సైరా భాను, దిలీప్‌ కుమార్‌ 1966 అక్టోబర్‌ 11న పెళ్లి చేసుకున్నారు. అప్పుడు దిలీప్‌ వయసు 44 కాగా సైరా వయసు కేవలం 22 మాత్రమే! దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైరాతో కలిసి జీవించిన దిలీప్‌ 2021 జూలై 7న మరణించారు.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement