దిలీప్ కుమార్‌ను పరామర్శించిన షారూఖ్ ఖాన్
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌ను కింగ్ ఖాన్ షారూఖ్ పరామర్శించారు. సోమవారం ముంబైలోని దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లిన షారూఖ్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్‌తో షారూఖ్ దిగిన ఫొటోను పారిశ్రామిక వేత్త ఫైసల్ ఫారూఖీ దిలీప్ కుమార్ ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. గత ఆరునెలల కాలంలో దిలీప్ కుమార్‌ను షారూఖ్ పరామర్శించడం ఇది రెండో సారి. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్న షారూఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు వ్యక్తిగా కనిపించనున్నాడు.
.@iamsrk came to visit Saab at home today. -FF pic.twitter.com/GLrnqu1Ln2
— Dilip Kumar (@TheDilipKumar) 12 February 2018
Comments
Please login to add a commentAdd a comment