Dilip Kumar Death: Lata Mangeshkar Shares Emotional Post, Comments On Saira Banu - Sakshi
Sakshi News home page

Dilip Kumar: మూగబోయా..సైరా భాభీ మీకు నమస్కారం!

Published Wed, Jul 7 2021 12:37 PM | Last Updated on Wed, Jul 7 2021 1:21 PM

 Iconic singer Lata Mangeshkar mourns to actor Dilip Kumar demise - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మరణంతో సీనీరంగంతో పాటు, యావత్‌  ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి లోనైంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో ‘ఆర్‌ఐపీ దిలీప్‌ సాబ్‌’ ట్రిండింగ్‌లో నిలిచింది. 

దిలీప్‌ అస్తమయంపై పలువురు నటీనటులతో పాటు ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘యూసుఫ్‌ భాయ్‌  తన చిన్న సోదరిని విడిచి వెళ్లిపోయారు..నాకేమీ తోచడం లేదు.. చాలా బాధగా ఉంది... మీ జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి..మౌనం ఆవహించింది’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా దిలీప్‌ సతీమణి సైరా బానుపై గౌరవంతో లతాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న  యూసుఫ్ భాయ్‌కి  సైరా భాభి ఎంతో సేవచూశారు. ఎవర్నీ గుర్తించలేని  స్థితిలో ఉన్న ఆయనను  రాత్రి పగలూ  కంటికి రెప్పలా కాపాడుకున్న సైరాబానుకు నమస్కరిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. యూసుఫ్ భాయ్  ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాన్నారు.  ఈ సందర్భంగా దిలీప్‌  కుమార్‌తో తన  కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు.  ఇంకా బాలీవుడ్‌ సీనియర్‌ నటి  షబానా అజ్మీ, టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా తదితరులు దిలీప్‌ కుమార్‌ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దిలీప్ సాబ్ అల్విదా అంటూ సంతాపం తెలిపిన షబానా, ఆయనకు తాను ఏకలవ్య శిష్యురాలనని చెప్పుకున్నారు. అంతేకాదు. దిలీప్‌జీ  నిమాలకు, భాషకు, డిగ్నీటీతోపాటు సామాజిక బాధ్యత వహించినందుకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు భర్తను కోల్పోయిన సైరా బాను తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సహచరుడి పార్థివదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు, పలువురు  ఓదార్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement