
'తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందరికి తెలుసు'
తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందిరికీ తెలుసు అని టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పై 10 అంశాలకు సంబంధించి ఆరోపణలున్న కవర్‌ను జేఏసీకి పంపిస్తున్నానని ఆయన అన్నారు. ఈ అంశాలపై జేఏసీ విచారణ జరిపించాలి అని దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. 2004లో తెలంగాణకు శత్రువైన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.. దీనికి బ్రోకర్ ఎవరు అని దిలీప్ కుమార్ నిలదీశారు. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే దీనికి కారకులెవరు అని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమ, ఆంధ్ర పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాలేమిటి, ఎంత వసూలు చేశారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. డబ్బున్న వారికే టీఆర్ఎస్ టిక్కెట్లు ఇస్తున్నారని.. ఎవరివద్ద ఎంత తీసుకున్నారని మీడియా ముఖంగా ప్రశ్నించారు. ప్రొఫెసర్ జయశంకర్‌ను టీఆర్ఎస్‌లో అవమానించలేదా అని అన్నారు. టీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని, తరపై చేసిన ఆరోపణలు ఉపసంహరించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దిలీప్ కుమార్ హెచ్చరించారు.