దిలీప్‌కుమార్‌కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక | Dilip kumar admitted to mumbai leelavathi hospital | Sakshi
Sakshi News home page

దిలీప్‌కుమార్‌కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక

Published Wed, Dec 7 2016 8:13 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

దిలీప్‌కుమార్‌కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక

దిలీప్‌కుమార్‌కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (93) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కుడి కాలు వాపు రావడం, బాగా జ్వరం కూడా రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. 
 
బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement