mumbai leelavathi hospital
-
మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (94) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. డీహైడ్రేషన్ కారణంగా దిలీప్ కుమార్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా దిలీప్‌కుమార్ గత రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉదయ తారా నాయర్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దిలీప్‌కుమార్ ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందిన విషయం తెలిసిందే. దిలీప్ కుమార్ చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. -
దిలీప్ కుమార్ క్షేమంగా ఉన్నారు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్యం మెరుగవుతోంది. దిలీప్ కుమార్ క్షేమంగా ఉన్నారని, క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. దిలీప్ కుమార్ తీవ్ర జ్వరంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దిలీప్ కుమార్‌ను త్వరలోనే ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తామని తెలిపారు. ఇంతకుముందు కూడా దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. -
దిలీప్ కుమార్‌కు సీరియస్ ఆస్పత్రిలో చేరిక
-
దిలీప్‌కుమార్‌కు సీరియస్.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (93) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కుడి కాలు వాపు రావడం, బాగా జ్వరం కూడా రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. కానీ ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలుపేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పడకపోవపడంతో.. ఇంటినుంచి వచ్చేసి పుణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్‌ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్‌గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. ఆయనకు ట్రాజెడీ కింగ్‌గా పేరుంది. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.