మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిలీప్‌ కుమార్‌ | Dilip Kumar admitted to Lilavati Hospital in Mumbai | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడికి మళ్లీ అస్వస్థత

Published Thu, Aug 3 2017 8:42 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిలీప్‌ కుమార్‌

మళ్లీ ఆస్పత్రిలో చేరిన దిలీప్‌ కుమార్‌

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (94) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బుధవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. డీహైడ్రేషన్‌ కారణంగా దిలీప్‌ కుమార్‌ను కుటుంబసభ్యులు   ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా దిలీప్‌కుమార్‌ గత రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఉదయ తారా నాయర్‌ తెలిపారు.

ఇంతకుముందు కూడా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దిలీప్‌కుమార్‌ ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. అయితే ఆయన భార్య, అలనాటి ప్రముఖ హీరోయిన్ సైరా బాను వాటిని ఖండించారు. అప్పట్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందిన విషయం తెలిసిందే. దిలీప్‌ కుమార్‌ చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement