లీలావతీ నుంచి డిశ్చార్జ్ కానున్న దిలీప్ కుమార్ | Dilip Kumar stable, to be discharged soon | Sakshi
Sakshi News home page

లీలావతీ నుంచి డిశ్చార్జ్ కానున్న దిలీప్ కుమార్

Published Sat, Sep 21 2013 3:13 PM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

లీలావతీ నుంచి డిశ్చార్జ్ కానున్న దిలీప్ కుమార్

లీలావతీ నుంచి డిశ్చార్జ్ కానున్న దిలీప్ కుమార్

నగరంలోని లీలావతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ హిందీ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన్ని మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశార్జ్ చేయనున్నారని దిలీప్ కుమార్ భార్య సైరా భాను మేనేజర్ ముర్షిద్ ఖాన్ శనివారం ముంబైలో వెల్లడించారు. అయితే ఆయన క్రమంగా కొలుకున్నారని, ప్రస్తుతం అత్యవసర సేవ విభాగం (ఐసీయూ)లో ఉన్నారన్నారు. త్వరలో జనరల్ వార్డుకు మారుస్తారని ఖాన్ చెప్పారు.



90 ఏళ్ల ఆ మహానటుడు ఆదివారం ఛాతీలో తెలికపాటి నెప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు దిలీప్ను లీలావతీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దిలీప్ కుమార్కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నెప్పిగా నిర్థారించారు. దిలీప్కుమార్ నటించిన జ్వార్ భాటా, మేళ, గంగా జమున, లీడర్, మొఘల్ ఏ అజాం, శక్తి, కర్మ, సౌదాగర్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మెగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement