రజనీ బాటలో దిలీప్ కుమార్ | Dilip kumar cancels birthday plans | Sakshi
Sakshi News home page

రజనీ బాటలో దిలీప్ కుమార్

Published Wed, Dec 9 2015 10:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

రజనీ బాటలో దిలీప్ కుమార్

రజనీ బాటలో దిలీప్ కుమార్

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు.  హిందీ సినీ పరిశ్రమలో కురువృద్దుడి దిలీప్ కుమార్ ఈ నెల 11వ తేదీన.. 93వ పడిలోకి అడుగుపెడుతున్నారు. అయితే చెన్నైలో వర్షాల కారణంగా భారీ విపత్తు సంభవించిన నేపధ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టుగా ఆయన  ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ చెన్నైతో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 12న తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దంటూ ఆయన తన అభిమానులు ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నై వాసులు తీవ్ర దుఖంలో ఉన్న సమయంలో పండుగలు చేసుకోవటం భావ్యం కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రజనీ ప్రకటించారు. ఇక రజనీ కాంత్, దిలీప్ కుమార్ల నిర్ణయాలపై అభిమానుల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement