కారేపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అనంతరం శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోకి వస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బంట్రోతులుగా మారే పరిస్థితి ఉందని టీఆర్‌ఎల్‌డీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కారేపల్లికి చెందిన టీఆర్‌ఎల్‌డీ జిల్లా నాయకుడు మండెపూడి రమణయ్యను ఆదివారం దిలీప్‌కుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చకు రాకుండా కుట్ర జరుగుతోందని, చర్చ అంశాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వడానికి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపా రు. సీమాంధ్రలో ఏడాది కాలంలో హైకోర్టును, రెండేళ్లలో రాజధానిని పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలన్నారు. సీమాంధ్ర నేతలు సమన్యాయం కోరడంలో తప్పు లేదని, కానీ బిల్లు ను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను క్షోభపెట్టినట్లే అవుతుందన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి శేషగిరిరావు, జిల్లా అధ్యక్షుడు రజనీకుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కల్లూరి శ్రీని వాసచారి, జూపల్లి రాము, బట్టు కిరణ్ ఉన్నారు.
శాంతిభద్రతలు గవర్నర్ కు ఇస్తే సీఎంలు బంట్రోతులే
Published Mon, Dec 23 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement