
చిరంజీవిగారు నాకు ఇన్‌స్పిరేషన్
‘‘తేజాగారి ‘హోరా హోరీ’ హీరోగా నా ఫస్ట్ మూవీ. ఆయన దగ్గర పని చేయడం స్కూల్‌కి వెళ్లడం లాంటిది. రెండో సినిమా ‘మాయామాల్’ హీరోగా నాకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దిలీప్‌కుమార్. గోవింద్ లాలం దర్శకత్వంలో నల్లం శ్రీనివాస్, కేవీ హరికృష్ణ నిర్మించిన ‘మాయామాల్’ ఈ నెల 14న విడుదల కానుంది.
దిలీప్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘గోవింద్ చెప్పిన కథ చాలా నచ్చింది. మంచి థ్రిల్లర్ ఎంటర్‌టైనర్. ఓ ఛేజ్‌తో వైజాగ్‌లో స్టార్టయి హైదరాబాద్ చేరుకుంటాం. షెల్టర్ కోసం ఓ మాల్‌లోకి ఎంటరవుతాం. సినిమాలోని ఇతర పాత్రలు కూడా ఎంటర్ అవుతాయి. ఆ రాత్రి నుంచి మరుసటిరోజు ఉదయం వరకు ఏం జరిగిందనేదే కథ. హారర్ అండ్ థ్రిల్ జోనర్ మూవీ.
ఒకే ఒక్క పాట, రెండు ఫైట్స్ ఉంటాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమాలంటే ఇష్టం. చిరంజీవిగారి అభిమానిని. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్. సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్‌కి కావల్సినవన్నీ మినిమమ్ నేర్చుకుని, తర్వాత వచ్చాను’’ అని చెప్పారు. ‘‘సేమ్ బ్యానర్‌లో ఒక సినిమా డిస్కషన్ జరుగుతోంది. ఇంకో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి’’ అన్నారు దిలీప్.