ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (90) ఆదివారం అనారోగ్యానికి గురవడంతో ఆయనను ముంబైలోని బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తరలించారు.
ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ (90) ఆదివారం అనారోగ్యానికి గురవడంతో ఆయనను ముంబైలోని బాంద్రాలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఛాతీనొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యుడు ఒకరు చెప్పారు.