1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా | Integrating coastal shipping with inland water transport | Sakshi
Sakshi News home page

1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా

Published Thu, Dec 28 2023 5:12 AM | Last Updated on Thu, Dec 28 2023 8:41 AM

Integrating coastal shipping with inland water transport - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్టు ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ చైర్మన్‌ దంతులూరి దిలీప్‌­కుమార్‌ చెప్పారు. త్వరలోనే జలరవాణా, కా­ర్గో రవాణాలో భాగంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) తీసుకొస్తామన్నారు. ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీస్‌ ఫెడరేషన్, ఇన్‌ల్యాండ్‌ వాట­ర్‌­వేస్‌ అథారిటీ సంయుక్తంగా బుధవారం విజయ­వాడలో వివిధ స్టేక్‌ హోల్డర్లతో నిర్వహించిన సమా­వేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ­వ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో జలరవాణా గ్రోత్‌ ఇంజన్‌గా మారుతోందన్నారు.

కాలుష్యంతో­పాటు ప్రతి కిలోమీటరుకు టన్ను సరుకు రవాణాలో రైలు కంటే 18 శాతం, రోడ్డు మార్గం కంటే 54 శాతం ఖర్చు తగ్గుందని చెప్పారు.  ఈ క్రమంలోనే లాభ­దాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర­ప్రదేశ్‌లోని నదీమార్గాల సామర్థ్యాల పెంపుపై సాంకేతిక పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో పాటు సుమారు 57 చిన్న, పెద్ద నదులున్నాయన్నారు.

వీటిద్వారా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలోని కోస్టల్‌ షిప్పింగ్‌ను ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ ట్రాన్స్‌­పోర్ట్‌తో అనుసంధానం చేసేందుకు ప్రణా­ళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో దాదాపు 1,555 కిలోమీటర్ల పొడవైన 11 నదులు/కాలువలు సరకు రవాణాకు అనువైన జలమార్గాలుగా మారతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

అంతర్గత జలరవాణాలో ఏటా 8 మిలియన్‌ టన్నుల సరుకు 
ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ సీఈవో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీకి నేషనల్‌ వా­టర్‌వేస్‌ (ఎన్‌డబ్ల్యూ)4 నంబరును కేటా­యిం­చగా.. దాదాపు 90 శాతం జలమార్గం ఏపీలోనే ఉందని చెప్పారు. కృష్ణానదిలో (వజీరా­బాద్‌­–విజయవాడ) 157 కిలోమీటర్లు, గోదావరిలో (భద్రాచలం–రాజమహేంద్రవరం) 171 కిలో­మీ­టర్లు, కాకినాడ కెనాల్‌ (కాకినాడ పోర్టు– ధవళేశ్వరం) 50 కి.మీ., ఏలూరు కెనాల్‌ (రాజ­మహేంద్రవరం–విజయవాడ) 139 కి.మీ., కొమ్మమూరు కెనాల్‌ (విజయ­వాడ–పెదగంజాం) 113 కి.మీ., నార్త్‌ బకింగ్‌హమ్‌ కెనాల్‌ (పెదగంజాం–తడ) 258 కి.మీ. మేర ఏపీ జలమార్గం విస్తరించిందని వివరించారు.

వీటితో పాటు ఎన్‌డబ్ల్యూ 79 కింద పెన్నానది (పోతిరెడ్డిపాలెం–కుడి­తిపాలెం/బంగాళా­ఖా­తం­) 32 కిలోమీటర్లు, ఎన్‌డబ్ల్యూ 104 కింద తుంగభద్ర నది (కిండి సింగవరం–జోహ్రా­పురం) 58 కి.మీ. ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏడాదికి ఎనిమిది మిలియన్‌ టన్నుల అంతర్గత జలరవాణా జరుగుతోందన్నారు. సిమెంట్‌ పరిశ్రమల క్లస్టర్లలో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్టణం, కాకినాడ పోర్టుకు సరుకు రవాణా చేసేలా అనుసంధా­నం చేస్తున్నా­మ­న్నారు. కడప ప్రాంతంలో సిమెం­ట్‌ పరిశ్రమ­లు, పవర్‌ ప్లాంట్లకు  పెన్నా­నది ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు జలమార్గం కలిసొస్తుందన్నారు.

గండికోటలో క్రూజ్‌ పర్యా­ట­కాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణానది తీరంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శనకు టెంపుల్‌ టూరిజం ప్రాజెక్టు చేపట్టా­మని చెప్పారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వర్చ్యువల్‌గా మాట్లాడా­రు. సమావేశంలో జలవనరుల­శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, హెరిటేజ్‌ క్రూజ్‌ కోల్‌కత్తా ప్రతి­నిధి రాజ్‌సింగ్, చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ అధ్య­క్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement