spo
-
1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్టు ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ చెప్పారు. త్వరలోనే జలరవాణా, కార్గో రవాణాలో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) తీసుకొస్తామన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా బుధవారం విజయవాడలో వివిధ స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో జలరవాణా గ్రోత్ ఇంజన్‌గా మారుతోందన్నారు. కాలుష్యంతోపాటు ప్రతి కిలోమీటరుకు టన్ను సరుకు రవాణాలో రైలు కంటే 18 శాతం, రోడ్డు మార్గం కంటే 54 శాతం ఖర్చు తగ్గుందని చెప్పారు. ఈ క్రమంలోనే లాభదాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నదీమార్గాల సామర్థ్యాల పెంపుపై సాంకేతిక పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో పాటు సుమారు 57 చిన్న, పెద్ద నదులున్నాయన్నారు. వీటిద్వారా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలోని కోస్టల్ షిప్పింగ్‌ను ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో దాదాపు 1,555 కిలోమీటర్ల పొడవైన 11 నదులు/కాలువలు సరకు రవాణాకు అనువైన జలమార్గాలుగా మారతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత జలరవాణాలో ఏటా 8 మిలియన్ టన్నుల సరుకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సీఈవో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీకి నేషనల్ వాటర్‌వేస్ (ఎన్‌డబ్ల్యూ)4 నంబరును కేటాయించగా.. దాదాపు 90 శాతం జలమార్గం ఏపీలోనే ఉందని చెప్పారు. కృష్ణానదిలో (వజీరాబాద్–విజయవాడ) 157 కిలోమీటర్లు, గోదావరిలో (భద్రాచలం–రాజమహేంద్రవరం) 171 కిలోమీటర్లు, కాకినాడ కెనాల్ (కాకినాడ పోర్టు– ధవళేశ్వరం) 50 కి.మీ., ఏలూరు కెనాల్ (రాజమహేంద్రవరం–విజయవాడ) 139 కి.మీ., కొమ్మమూరు కెనాల్ (విజయవాడ–పెదగంజాం) 113 కి.మీ., నార్త్ బకింగ్హమ్ కెనాల్ (పెదగంజాం–తడ) 258 కి.మీ. మేర ఏపీ జలమార్గం విస్తరించిందని వివరించారు. వీటితో పాటు ఎన్‌డబ్ల్యూ 79 కింద పెన్నానది (పోతిరెడ్డిపాలెం–కుడితిపాలెం/బంగాళాఖాతం) 32 కిలోమీటర్లు, ఎన్‌డబ్ల్యూ 104 కింద తుంగభద్ర నది (కిండి సింగవరం–జోహ్రాపురం) 58 కి.మీ. ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల అంతర్గత జలరవాణా జరుగుతోందన్నారు. సిమెంట్ పరిశ్రమల క్లస్టర్లలో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్టణం, కాకినాడ పోర్టుకు సరుకు రవాణా చేసేలా అనుసంధానం చేస్తున్నామన్నారు. కడప ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, పవర్ ప్లాంట్లకు పెన్నానది ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు జలమార్గం కలిసొస్తుందన్నారు. గండికోటలో క్రూజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణానది తీరంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శనకు టెంపుల్ టూరిజం ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చ్యువల్‌గా మాట్లాడారు. సమావేశంలో జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, హెరిటేజ్ క్రూజ్ కోల్కత్తా ప్రతినిధి రాజ్‌సింగ్, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యల ధరల నియంత్రణకు ఎస్వోపీ
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో రొయ్య రైతులకు నష్టం వాటిల్లకుండా అన్ని విధాలుగా కృషిచేస్తోంది. ధరల నియంత్రణ కోసం ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందిస్తోంది. రోజూ మార్కెట్‌ను సమీక్షించడమేగాక రొయ్య రైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరోపక్క రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ వల్లే.. ప్రధానంగా 100 కౌంట్ రొయ్యల ప్రధాన దిగుమతిదారైన చైనా కొనుగోలు ఆర్డర్లను పూర్తిగా నిలిపేసింది. రూ.వెయ్యి కోట్లకుపైగా చెల్లింపులను ఆపేసింది. మరోవైపు నాలుగులక్షల టన్నులకు మించి ఉత్పత్తి చేయని ఈక్వెడార్ దేశం ఈ ఏడాది 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తూ మన రొయ్యల కంటే తక్కువ ధరకు అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫలి తంగా దేశీయంగా రొయ్యల మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పరిస్థితిని సమీక్షించేందుకు సీనియర్ మంత్రులతో ఏర్పాటు చేసిన సాధికారత కమిటీ పలుమార్లు సమావేశమై పెంచిన ఫీడ్ ధరలను తగ్గించడమేగాక తగ్గిన కౌంట్ ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టింది. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు పెంచిన రూ.2.60ని మేత తయారీదారులు తగ్గించారు. ఎగుమతి మార్కెట్‌కు అనుగుణంగా పంటల ప్రణాళిక ప్రాసెసింగ్ కంపెనీలు, ట్రేడర్లతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో రొయ్యల ధరలను నిర్ణయించారు. ఈ ధరలు కనీసం 10 రోజులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇకనుంచి సీజన్ ప్రారంభానికి ముందే ఎగుమతి మార్కెట్ పోకడలను అంచనావేస్తూ పంటల ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా సాగుచేపట్టేలా రైతులను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు రొయ్య రైతులు, మేత తయారీదారులు, సీ ఫుడ్ ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని న్యూఢిల్లీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చేసుకోవడం, రొయ్యల ఎగుమతుల ప్రోత్సాహకాల (డ్యూటీ డ్రా బ్యాక్) శాతం పెరుగుదల, ఆక్వాఫీడ్ ఇన్పుట్లపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర విషయాలపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి నివాస ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు రూ.2,377.52 కోట్ల సబ్సిడీ వాస్తవంగా యూనిట్ విద్యుత్ రూ.6.89 ఉండగా ఆక్వాజోన్ పరిధిలోని 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువులకు యూనిట్ రూ.1.50, జోన్ వెలుపల ఉన్న చెరువులకు రూ.3.86 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో రూ.2,377.52 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే.. రొయ్య రైతులు విలవిల అంటూ ఆక్వారంగంలో ఉన్న వారిని ఆందోళనకు గురిచేసేలా ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుండడం పట్ల ఆక్వా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు చూసి ఓర్వలేకనే ‘ఈనాడు విలవిల’లాడిపోతోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రొయ్యల ధరలు ఇలా.. కౌంట్ ధర (రూపాయల్లో) 100 210 90 220 80 240 70 250 60 270 50 290 40 340 30 380 కష్టకాలంలో ప్రభుత్వం మేలు మరిచిపోలేం నేను 30 ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నా. 20టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇటీవల సాధికారత కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం 30 కౌంట్ రూ.380 చొప్పున 6 టన్నులు, 40 కౌంట్ రూ.340 చొప్పున 5 టన్నులు, 50 కౌంట్ రూ.290 చొప్పున 3 టన్నులు, 60 కౌంట్ రూ.270 చొప్పున 6 టన్నులు విక్రయించా. గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిన దాఖలాలు లేవు. ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి మద్దతుధర లభించేలా చేసింది. అంతర్జాతీయంగా ధరలు పతనమైనప్పటికీ ప్రభుత్వం దగ్గరుండి మరీ అమ్మించడంతో రైతులు గట్టెక్కగలుగుతున్నారు. – త్సవటపల్లి నాగభూషణం, ఆక్వారైతు, చెయ్యేరు, కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రభుత్వం అండగా నిలుస్తోంది అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో కౌంట్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధికారత కమిటీ ద్వారా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంటే రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆరోపణలు చేయడం సరికాదు. ఈనాడు కథనంలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. – కె.కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
ఇంటి ముందే మహిళా పోలీసు హత్య
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తన నివాసం ముందే మహిళా పోలీసు ఆఫీసర్‌ను కాల్చి చంపారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని వెహ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల... దక్షిణ శ్రీనగర్‌లో స్పెషల్ పోలీసు ఆఫీసర్‌గా ఖుష్బూ జాన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కొంతమంది ఉగ్రవాదులు ఆమె ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం ఖుష్బూపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించామని, కానీ అప్పటికే ఖుష్బూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. హేయమైన ఈ చర్చను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఖుష్బూ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ భద్రతా బలగాలు ఘటనాస్థలిని అదుపులోకి తీసుకుని.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి, పోలీసులకు సానుభూతి తెలిపారు. కాగా ఉగ్రవాదులను ఏరిపారేయడానికి కశ్మీర్ పోలీసులు నెలవారీ జీతం ఇచ్చి కొంత మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అయితే వారికి సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆయుధాలు సరఫరా చేయకుండానే పని చేయాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల అనంతరం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. A lady special police officer (SPO) was shot & killed outside her home in South Kashmir earlier today. I condemn this act of terror & extend my condolences to her family & all her J&K police colleagues. — Omar Abdullah (@OmarAbdullah) March 16, 2019 -
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్
(ఐఐఎం)ల.. బ్రాండ్ ఇమేజ్ మరోసారి నిరూపితమైంది. ఐఐఎం విద్యార్థులు.. ఇండస్ట్రీకి హాట్‌కేక్స్ అని స్పష్టమవుతోంది. విదేశీ పరిశ్రమలకు సైతం ఐఐఎం విద్యార్థులు.. బెస్ట్ ప్రిఫరెన్స్‌గా నిలుస్తున్నారు. ఇందుకు నిదర్శనం.. ఐఐఎం క్యాంపస్‌లలో కొనసాగుతున్న.. సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ (ఎస్పీఓ). రెండు నెలల వ్యవధిలో ఉండే ఇంటర్న్‌షిప్ దిశగా.. ఎస్పీఓ స్టైపెండ్ రూ. రెండు లక్షలకు పైగానే ఉంది. జాతీయ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కొంత తగ్గే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో.. ఐఐఎంలలో పెరిగిన సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌పై విశ్లేషణ.. రెండేళ్ల పీజీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో కంపెనీల్లో రెండు నెలల ఇంటర్న్‌షిప్ చేసేందుకు మార్గం ఎస్పీఓ. విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందించే ఎస్పీఓల విషయంలో ఐఐఎంల విద్యార్థులను నియమించుకోవడానికి బహుళ జాతి సంస్థలు రూ.లక్షలు ఆఫర్ చేస్తుండటం విశేషం. 2016-18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఐఐఎంలలో ఈ ప్రక్రియ ముగిసింది. మిగతా ఐఐఎంలలో ఈ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. పెరిగిన ఎస్పీఓల శాతం క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఈ ఏడాది మందగమన పరిస్థితులు ఉన్నాయనే నిపుణుల అభిప్రాయాల నడుమ కొన్ని ఐఐఎంలలో ముగిసిన ఎస్పీఓల్లో మాత్రం ఆఫర్ల సంఖ్య పెరగడం విశేషం. ఎస్పీఓ ముగిసిన 8 ఐఐఎంలలో ఆఫర్ల సంఖ్య సగటున 25 నుంచి 30 శాతం పెరిగింది. కొత్త, పాత ఐఐఎంలు అనే బేధం లేకుండా అన్నిటిలోనూ ఈ శైలి కొనసాగడం మరో విశేషం. అహ్మదాబాద్ టు విశాఖపట్నం టాప్ బీ స్కూల్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న అహ్మదాబాద్ ఐఐఎం మొదలు గత ఏడాదే ప్రారంభమైన విశాఖపట్నం వరకు అంతటా ఎస్పీఓల్లో పెరుగుదల నమోదవడం విశేషం. సెప్టెంబర్ చివరలో ప్రారంభమై నవంబర్ రెండో వారం వరకు కొనసాగిన ఎస్పీఓ ఆయా ఐఐఎంలలో రెండు, మూడు రోజుల్లోనే ముగిసింది. విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో సమ్మర్ ఇంటర్న్స్‌గా విధులు నిర్వహించే అవకాశం లభించింది. దాదాపు అందరికీ అహ్మదాబాద్, కోజికోడ్, బెంగళూరు, కోల్‌కతా వంటి పాత ఐఐఎంలలో 100 శాతం మందికి ఆఫర్లు లభించాయి. ఐఐఎం బెంగళూరులో మొత్తం 402 మంది విద్యార్థులకూ ఎస్పీఓలు దక్కాయి. ఐఐఎం కోజికోడ్‌లోనూ మొత్తం 364 మంది పొందారు. ఐఐఎం లక్నోలో మొత్తం 458 మంది విద్యార్థులకూ ఎస్పీఓలు లభించాయి. కొత్తదైన ఐఐఎం ఇండోర్‌లో సైతం 100 శాతం ఎస్పీఓలు దక్కడం విశేషం. ఐఐఎం విశాఖపట్నంలో 60 మంది విద్యార్థుల్లో 54 మంది వీటిని చేజిక్కించుకున్నారు. సంస్థల సంఖ్యలోనూ పురోగమనం గత ఏడాదితో పోల్చితే సగటున 25 నుంచి 40 శాతం పెరుగుదల కనిపించింది. కొత్త సంస్థలు భారీగా పెరిగాయి. ఐఐఎం కోజికోడ్‌లో 119 సంస్థలు ఎస్పీఓ నిర్వహించగా అందులో 45 శాతం కొత్తవే. ఐఐఎం బెంగళూరులో 150 సంస్థలు పాల్గొనగా అందులో 30 శాతం పైగా కొత్త సంస్థలే ఉన్నాయి. ఐఐఎం కోల్‌కతాలో 24 శాతం పెరుగుదల కనిపించింది. ఇదే ధోరణి ఇతర సంస్థల్లోనూ ప్రతిబింబించింది. పెరిగిన మొత్తం ఎస్పీఓల్లో ఈసారి స్టైపెండ్ సగటున 15 నుంచి 25 శాతం పెరిగింది. అంకెల్లో చూస్తే సగటున రూ.1.25 లక్షల చొప్పున లభించాయి. ఐఐఎం కోజికోడ్‌లో సగటు స్టైపెండ్ రూ.2.5 లక్షలు. కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ హవా ఎస్పీఓల్లో పాల్గొన్న కంపెనీల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే ఎప్పటి మాదిరిగానే ఈసారీ కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ రంగ సంస్థల హవా కొనసాగింది. ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థలు పాల్గొన్నాయి. బోస్టన్ కన్సల్టింగ్, మెకిన్సే, మోర్గాన్ స్టాన్లీ వంటి వాటిని ఉదాహరణగా పేర్కొనొచ్చు. బీఎఫ్ఎస్ఐకు సంబంధించి ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్; అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బార్క్లేస్, సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఎస్పీఓ సీజన్ తొలి రోజే ఆఫర్ల వెల్లువ కురిపించాయి. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగంలో ఇంటర్న్స్‌ను రిక్రూట్ చేసుకోవడానికి బీఎఫ్ఎస్ఐ సంస్థలు ప్రాధాన్యం ఇచ్చాయి. మారిన దృక్పథం ఎస్పీఓలను అంగీకరించే విషయంలో ఈ ఏడాది విద్యార్థుల దృక్పథంలో మార్పు కనిపించింది. చాలా మంది సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఎస్పీఓలు ముగిసిన ఐఐఎంలలో ఆఫర్ల యాక్సెప్టెన్స్ కోణంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్ సంఖ్య 30 శాతం నమోదయ్యాయి. ఈ-కామర్స్.. తగ్గిన హవా ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఇన్స్టిట్యూట్ వర్గాల నుంచి తిరస్కృతికి గురైన సంగతి తెలిసిందే. ఇది ఐఐఎంల ఎస్పీఓ సీజన్లోనూ ప్రతిబింబించింది. ఈ-కామర్స్ సంస్థలు అతి స్వల్ప సంఖ్యలో పాల్గొన్నాయి. అయితే అమెజాన్ డాట్ కామ్ ఈ-కామర్స్ సంస్థల పరంగా అగ్ర భాగంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్‌లోని మూడు క్లస్టర్లలో నిర్వహించిన ఎస్పీఓలో తొలి క్లస్టర్లో 25 ఆఫర్లతో అమెజాన్ టాప్ రిక్రూటర్‌గా నిలిచింది. ఐఐఎం బెంగళూరులోనూ 20 ఆఫర్లు ఇచ్చింది. ప్రముఖ బి-స్కూల్స్‌లోనూ ఇదే ట్రెండ్ ఎస్పీఓల్లో ఆఫర్ల వెల్లువ ఐఐఎంలే కాకుండా ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లోనూ కనిపించింది. ప్రైవేట్ బి-స్కూల్స్ పరంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచే ఎక్స్ఎల్ఆర్ఐలో 361 మంది విద్యార్థుల్లో అందరికీ ఎస్పీఓలు లభించాయి. ఇక్కడ సగటు స్టైపెండ్ రూ.1.10 లక్షలు నమోదైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్‌లోనూ ఈ హవా కనిపించింది. మొత్తం 288 మంది విద్యార్థుల్లో అందరికీ ఎస్పీఓలు లభించడమే కాకుండా సగటు స్టైపెండ్ రూ.1.24 లక్షలు నమోదవడం, 60 శాతానికి పైగా విద్యార్థులకు రూ.లక్షకు పైగా అందడం విశేషం. ఎస్పీఓతో ఏం చేయాలి రెండేళ్ల మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎస్పీఓ నిర్వహిస్తారు. వీటిలో ఎంపికైన అభ్యర్థులు ఫస్టియర్ పరీక్షలు ముగిశాక లభించే రెండు నెలల వ్యవధిలో తాము ఎంపికైన సంస్థలో, విభాగంలో విధులు నిర్వర్తించాలి. రెగ్యులర్ టెర్మినాలజీలో దీన్ని ఇంటర్న్షిప్గా పరిగణిస్తారు. ఈ రెండు నెలల వ్యవధిలో తమ సంస్థలో ఇంటర్న్ ట్రైనీగా పని చేసినందుకు సంస్థలు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహాన్నే ఎస్పీఓ ఆఫర్ లేదా స్టైపెండ్ అంటారు. ఈ సమయంలో విద్యార్థులు సంబంధిత సంస్థలో చక్కటి పనితీరు చూపాలి. ఇలా చేస్తే అదే కంపెనీలో కొనసాగేలా సంస్థలు అభ్యర్థుల ఆసక్తిని తెలుసుకుంటాయి. ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ఎస్పీఓల్లో నమోదైన గణాంకాలు, ఆఫర్లు, కంపెనీల సంఖ్య, వారి శైలిని పరిశీలిస్తే త్వరలో ప్రారంభం కానున్న ఫైనల్ ప్లేస్మెంట్ సీజన్‌కు శుభ సూచికలుగా పేర్కొనొచ్చు. డిసెంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఫైనల్ ప్లేస్మెంట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణుల అభిప్రాయం. ఫైనల్ ప్లేస్‌మెంట్‌కు మార్గదర్శకంగా ఎస్పీఓ సీజన్లో కంపెనీలు అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన విధానాలను త్వరలో జరగనున్న ఫైనల్ ప్లేస్మెంట్ ప్రక్రియకు మార్గదర్శకంగా భావించాలి. కొన్ని సంస్థలు ఎస్పీఓ తేదీకి ముందు రోజు బృంద చర్చలు, రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించాయి. ఐఐఎం ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో ఇవి సహజమే. త్వరలో వీటిని ఎదుర్కోనున్న అభ్యర్థులు ఎస్పీఓలో పాల్గొన్న వారి ద్వారా కంపెనీలు ఆశించే లక్షణాలు, గ్రూప్ డిస్కషన్లలో ప్రాధాన్యమిచ్చిన టాపిక్ల గురించి తెలుసుకోవడం మేలు చేస్తుంది. - గౌతమ్ ఈశ్వర్, ప్లేస్మెంట్ కమిటీ సెక్రటరీ, ఐఐఎం- ఇండోర్ -
మావోల చేతిలో మాజీ ఎస్పీఓ హత్య
భద్రాచలం, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు మళ్లీ కలకలం రేపారు. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి పంచాయతీలో గల బట్టిగుంపు వద్ద బుధవారం మాజీ ఎస్పీఓను దారుణంగా కత్తులతో పొడిచి చంపిన ఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కోడిపందేలు నిర్వహించే ప్రదేశానికి సాధారణ ప్రజల్లా వచ్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులు పందేలు చూస్తున్న మడివి సోమయ్య(36) అనే మాజీ ఎస్పీఓపై దాడి చేసి హత మార్చారు. గతంలో సల్వాజుడుం సభ్యుడిగా పనిచేసిన సోమయ్య ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా మారాయిగూడెం పోలీసు స్టేషన్లో సహాయ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనతో మన జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులపై పోలీసులే పై చేయి సాధించారు. సరిగ్గా ఏడాది క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పూవర్తి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు. కెకేడబ్ల్యూ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటం ఒక రకంగా పోలీసులు సాధించిన విజయంగానే చెప్పాలి. గత ఏడాది అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బడేచల్మ వద్ద జరిగిన మరో ఎన్ కౌంటర్లో శబరి దళ కార్యదర్శి నరేష్‌తో పాటు మరో దళ సభ్యుడు తెల్లం రాములు మృతి చెందాడు. దీంతో దాదాపు శబరి దళం కూడా కనుమరుగైపోయినట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో మన రాష్ట్రం పరిధిలో వెంకటాపురం ఏరియా కమిటీనే పనిచేస్తున్నట్లుగా భావిస్తున్న పోలీసులు మరో అడుగు ముందుకేసి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దీనికి నిరసనగా మావోయిస్టులు అడపా దడపా చిన్న పాటి సంఘటనలకు పాల్పడుతూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రిక్రూట్మెంట్లపై ప్రత్యేక దృష్టి : పూవర్తి ఎన్కౌంటర్ తరువాత ఛత్తీస్‌గఢ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన మావోయిస్టులు మన రాష్ట్రానికి ఆనుకొని ఉన్న సరిహద్దు అటవీప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూవర్తి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వెంకటాపురం మండలం సూరవీడు కాలనీ వద్ద గత ఏడాది జూన్ నెలలో ఓ వ్యక్తిని హత్య చేసి పడేశారు. గతేడాది అక్టోబర్‌లో భద్రాచలం మండలం గొల్లగుప్పకు చెందిన మడకం కోసాను హత్య చేసి చింతూరు మండలం కాటుకపల్లి వద్ద రహదారిపై పడేశారు. ఉనికిని చాటుకునే క్రమంలోనే ఈ ఘటనకు పాల్పడిన మావోయిస్టులు దళాన్ని పెంచుకునేందుకు భారీగానే రిక్రూట్మెంట్లును చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం దీన్ని అవుననే అంటున్నాయి. పోలీసులు కనుమరుగైపోయిందనుకున్న శబరి దళాన్ని బలోపేతం చేసేందుకు కొత్తగా సంతూకు బాధ్యతలు అప్పగించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా సరిహద్దు గ్రామాల్లో సాధారణ గిరిజనుల మాదిరే తిరుగుతున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున యువకులను ఉద్యమంలోకి తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో గ్రామాల్లో తమకు అనుకూలంగా సానుభూతి పరుల మద్దతును కూడగట్టుకుంటున్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. సరిహద్దు గ్రామాల్లో భయాందోళన : చాపకింద నీరులా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు అదును చూసి దాడులకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారనే నిఘా వర్గాల హెచ్చరికలతో వీరిని ఎదుర్కొనేందుకు పోలీసులు సైతం ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల మధ్య ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.