సాక్షి, ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు రుషికపూర్ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు డెంగీ సోకినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రిషి కపూర్ నివాసముంటున్న పాలిహిల్ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉందని బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది ఒకరు చెప్పారు. కొద్ది రోజులుగా కపూర్ జ్వరంతో బాధపడుతున్నారు. రక్త పరీక్షల్లో ఆయనకు డెంగీ సోకినట్లు నివేదిక రావడంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రిలోని 11వ అంతస్తులో చేర్చారు. కాగా కపూర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.