అమితాబ్‌ ‘102 నాట్‌ అవుట్‌’ | Amitabh Bachchan 102 Not Out First Look Is Out | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ ‘102 నాట్‌ అవుట్‌’

Published Fri, Mar 23 2018 6:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Amitabh Bachchan 102 Not Out First Look Released - Sakshi

సాక్షి, ముంబై : బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రిషీ కపూర్‌ తండ్రి కొడుకులుగా నటిస్తున్న చిత్రం 102 నాట్‌ అవుట్‌. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. నటుడు రిషీ కపూర్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా ఫస్ట్‌ లుక్‌ను షేర్‌ చేశారు. తండ్రి కూల్‌.. కొడుకు ఓల్డ్‌ స్యూల్‌ అని ట్వీట్‌ చేశారు. 27 సంవత్సరాల తర్వాత హేమాహేమీలిద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

గుజరాతీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహించారు. వయసు మళ్లిన తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలే కథాంశంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ని బట్టి అర్థం అవుతోంది. అమితాబ్‌, రిషీల కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన కబీ కబీ, అమర్‌ అక్బర్‌ ఆంథోని, నషీబ్‌, కూలీ, అజూబా చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలు నమోదు చేశాయి. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ‘102 నాట్‌ అవుట్‌’ అదే మేనియాను కొనసాగిస్తుందా? చూద్దాం. మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement