
ఆస్పత్రి నుంచి రిషి కపూర్ డిశ్చార్జ్
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి ఇకపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లీలావతి ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నారు. మలేరియా జ్వరం రావడంలో ఆయన బుధవారం ఆస్పత్రిలో చేరారు.
'రిషి కపూర్ పూర్తిగా కోలుకున్నారు. గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు' అని రిషీకపూర్ కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. 62 ఏళ్ల రిషి కపూర్ ఇటీవల డు డూనీ చార్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాల్లో కనిపించారు.